ASP Hanumanthu inspirational story : నాటుసారా కాచే గుడిసెలో పుట్టాను… భిక్షాటన చేస్తూ విద్యాభ్యాసం… డబ్బు కోసం సమాధులు తవ్వి…: ఏఎస్పి హనుమంతు ఇన్స్పిరేషనల్ కథ

0
173

ASP Hanumanthu inspirational story : చదువు మాత్రమే పేదరికాన్ని మన స్థాయిని మారుస్తుందని మరోసారి నిజం చేసిన వ్యక్తి ఏఎస్పి హనుమంతు గారు. కష్టాలెన్ని ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి అదే మనల్ని నడిపిస్తుందని నిరూపించిన ఆయన జీవిత కథ నేటి తరంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. చదువుకోడానికి పేదరికం అడ్డురాదని కస్టపడుతూనే చివరికి భిక్షాటన చేస్తూ కూడా తన లక్ష్యం వైపు అడుగేసారు హనుమంతు గారు. ఒకప్పుడు తన తండ్రి కూలి పనిచేసిన వాళ్ళింటి వ్యక్తికి సెక్యూరిటి ఆఫీసర్ గా పనిచేసిన ఆయన జీవితం గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అమ్మతో కలిసి భిక్షాటన… కూలి పని చేస్తూ చదువు…

చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామంలో నాటుసారా తయారు చేసే గుడిసెలో పుట్టిన హనుమంతు గారు నాటుసారా తయారు చెయకూడదని పోలీసులు హెచ్చరించడం, అలాగే వారి కౌన్సిలింగ్ వల్ల కూలి పనులను చేసుకోవడం వల్ల పేదరికంలో తన బాల్యం గడిపారు. పని ఉన్న రోజు అన్నం లేదంటే లేదు అనే స్థితిలో పక్కన ఉన్న గ్రామానికి భిక్షాటనకు తల్లితో వెల్లి అన్నం కూరలు తెచ్చుకునేవారట. అలా వెళ్లడం వల్ల పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు కలిసేవారు మాట్లాడేవారు కాదట. అలా చదువుకున్న ఆయన అన్నం దొరుకుతుందని సంక్షేమ హాస్టల్ లో చేరి చదువుకున్నారట. ఇక ఇంట్లో ఆసరాగా ఉండాలని ఉదయం అడవి లోకి వెళ్లి కట్టెలను కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో ఇచ్చి స్కూల్ కి వెళ్లి చదువుకున్నారట. ఇక పెళ్లి లాంటి వేడుకలు, అలానే కర్మ ఖాండలు వంటి వాటికి వెళ్లి పనులను చేసి డబ్బు సంపాదించేవారట.

ఇక తన తండ్రి మాజీ సీఎం కిలారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి అమర్నాథ్ రెడ్డి గారి వద్ద పనిచేయగా ఆయన వద్ద చనువు ఉండేదని, ఆయనతో మా నాన్న నా పిల్లలను మీ పిల్లలంత చదివిస్తా అంటూ చెప్పేవారని హనుమంతు తెలిపారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యాక సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు లో పనిచేశానని, సీఎం కాన్వయ్ కి పనిచేసినపుడు కిరణ్ గారు గుర్తుపెట్టుకుని మాట్లాడటం మర్చిపోలేనని, ఆరోజు పేపర్ లో కిరణ్ గారి గురించి ఎంత రాసారో అంతే నా గురించి కథనాలు రాసారు. అది చాలా త్రిల్లింగ్ అనిపించిందంటూ హనుమంతు తెలిపారు. ఇక తన అన్న తమ్ముడు కూడా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారంటూ తెలిపారు.