Venu Swamy: సంచలనాత్మక జ్యోతిష్యులు వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రభాస్ గురించి ఆయన సినిమాల గురించి జాతకాలు చెబుతూ ప్రభాస్ అభిమానులకు టార్గెట్ గా నిలిచారు. ఇలా ఎన్నో సందర్భాలలో ప్రభాస్ అభిమానులు ఈయనని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయినప్పటికీ వేణు స్వామి మాత్రం ప్రభాస్ విషయంలో ఎప్పటికప్పుడు తన జాతకాన్ని చెబుతూనే ఉన్నారు.

ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అని చెప్పారు కానీ ఇటీవల కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. కల్కి మంచి సక్సెస్ అందుకుంది మీ జాతకం తప్పయింది కదా అనే ప్రశ్న యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ బాహుబలి 2తర్వాత విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అప్పుడు ఎవరు నా మెడలో దండ వేసి మీరు చెప్పింది నిజమని చెప్పలేదే అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఇక సలార్ కూడా హిట్ అని అభిమానులు భావించారు కానీ 135 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ఈయన తెలిపారు. ఇక కల్కి కూడా హిట్ అయిందని భావిస్తున్నారు ఇంకా నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్ల గురించి క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. అసలు కల్కి సినిమా ఎలా హిట్ అయింది ఈ సినిమాలో హీరో ఎవరు ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపిస్తున్నారు అంటూ ఈయన కల్కి సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మా తోట పండ్లు పంపిస్తాము..
ఇక వ్యక్తిగతంగా ప్రభాస్ నాకు పెద్ద శత్రువేమీ కాదు మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము తరచూ మా తోటలో పండిన పండ్లు ఆయనకు పంపిస్తూ ఉంటాము అలాగే ఇటీవల నేను పెట్టుకున్న కళ్ళజోడు చాలా బాగుందని ప్రభాస్ మేనేజర్ నాకు ఫోన్ చేసి మరి వివరాలు కనుకున్నారని ఈ సందర్భంగా ప్రభాస్ గురించి వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























