YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి పులివెందులకు చేరుకున్నారు. నిన్న ఈయన కడప ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గనా పులివెందులకు వెళ్లారు. అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇక పులివెందులలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే పులివెందులకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. జగన్ పై వ్యతిరేకత ఉండటంతోనే ఆయన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఇంట్లో గ్లాసులను పగలగొట్టారు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అయితే ఈ వార్తలపై వైసీపీ స్పందించింది.
జగన్ ఇంటి పై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు తర్వాత మొదటిసారి పులివెందులకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని దీంతో కాస్త పెనుగులాట చోటు చేసుకోవడం వల్ల ఇంట్లో గాజు సామాన్లు పగిలిపోయాయని అంతకుమించి ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు.
జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు..
ఇక జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత పులివెందులకు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది అయితే పోలీసులు వారందరినీ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు దీంతో నేడు జగన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. మరో నాలుగు రోజులపాటు జగన్ పులివెందులలోనే ఉంటూ అక్కడ నాయకులతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే.





























