Auto Ram Prasad : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పైకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. అయితే సినిమా అవకాశాలు ఎక్కువ రావడం ఇతర చానెల్స్ నుండి కూడా అవకాశాలు రావడంతో చాలా మంది జబర్దస్త్ ను వీడుతున్నారు. ఇక జబర్దస్త్ లో మొదటి నుండి సుడిగాలి సుధీర్ టీంలో సుధీర్, రామ్ ప్రసాద్, గెట్అప్ శీను మంచి కాంబినేషన్ గా వాళ్ళ స్కిట్లతో అందరిని ఆకట్టుకున్నారు.
ఒంటరి వాడిని అయిపోయాను…..

ఇక ఈ ముగ్గురు అప్పటినుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇన్ని రోజులు కలిసి స్కిట్లు కొట్టిన ఈ ముగ్గురు ఇపుడు జబర్దస్త్ లో కలిసి లేరు. కారణాలు ఏవైనా శీను, సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. దీంతో రామ్ ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పటికే వాళ్లను బాగా మిస్ అవుతున్న రామ్ ప్రసాద్ తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ వేదిక పై వారి ముగ్గురి ప్రయాణంను స్కిట్ లా చూపించడంతో మరింత ఎమోషనల్ అయ్యాడు. కెవ్వు కార్తీక్, నూక రాజు, రాకేష్ ఈ ముగ్గురు జబర్దస్త్ లో 2013 నుండి సుధీర్, రామ్ ప్రసాద్, శీనుకి సంబంధించిన సంఘటనల ఆధారంగా స్కిట్లను అనుకరించి చూపించారు. ఇక షోలో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

రష్మీ, జడ్జి గా ఉన్న ఇంద్రజ, సదా కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇంద్రజ స్పందిస్తూ మీ స్నేహానికి దిష్టి తగిలినట్టుంది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ నేను ఒంటరివాడిని అయిపోయాను అంటూ కంట తడి పెట్టుకున్నారు. ఇక ప్రతిసారి ఈటీవీలో మల్లెమాల ప్రోగ్రామ్స్ నుండి వచ్చే ప్రోమోలకు నెగెటివ్ కామెంట్లు ఇచ్చే వారు. ఈ ప్రోమోకి మాత్రం అందరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇక ఎపిసోడ్ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో చూడాలి.
































