Avasarala Srinivas: అవసరాల శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు ఈయన నటుడిగా దర్శకుడిగా స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ తను రాసిన కథలకు తానే దర్శకుడిగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా నాగశౌర్య, మాళవిక నాయక్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ సినిమా మార్చ్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక ఈ చిత్రాన్ని ఒక లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా అవసరాలు శ్రీనివాస్ ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Avasarala Srinivas: డబ్బులు ఇస్తే సినిమా కథలు ఇస్తా…
ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారి కష్టాన్ని గుర్తించి వారికి సరైన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే తన కథలను ఇతరులకు ఇవ్వకుండా తానే సినిమాలు చేస్తున్నానని అయితే తన సినిమా కథలకు డబ్బులు ఇస్తే ఇతరులకు కూడా ఇస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఇలా రచయితలకు డబ్బులు ఇవ్వరు అంటూ అవసరాల శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.































