Avinash Reddy: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి మనకు తెలిసిందే. 2019 ఎన్నికలలో 151 అసెంబ్లీ స్థానాలు 202 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ పార్టీ ఈసారి మాత్రం నాలుగు ఎంపీ సీట్లు 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ విధంగా వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీలో గెలిచిన నలుగురు ఎంపీలు సైతం బిజెపిలోకి వెళ్తున్నారంటూ
జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. కడప ఎంపీగా మూడోసారి ఈయన విజయం సాధించారు.
ఇలా కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పార్టీలు మారుతున్నామంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి పూటకు ఒక పార్టీ మారుతారు కనుక ఆయనకు అలాంటి ఆలోచనలే వస్తాయి అంటూ ఈయన కౌంటర్ వేశారు.
జగన్ వెంటే మేము..
మాకు ఎన్ని సీట్లు వచ్చినా మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటామని ఈయన తెలిపారు. మేమంతా పార్టీ మారుతున్నామని ఎల్లో మీడియా కేవలం తప్పుడు ప్రచారాలను చేస్తోందని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో నాపై చాలామంది ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ ప్రజలు నాపై ఉంచిన నమ్మకమే నన్ను గెలిపించిందని ఈ విజయం ప్రజలందరికీ అంటూ ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గొడవలు అల్లర్లపై కూడా ఈయన స్పందిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేశారు.



























