Avula Giri : ప్రభాస్ తో సినిమా చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ చేసాడు…: ప్రొడ్యూసర్ ఆవుల గిరి

0
254

Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపిన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయి ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రభాస్ తో సినిమా ఆగిపోడానికి కారణం ఎన్టీఆరే…

ఆవుల గిరి ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయనతో నా అల్లుడు, ఆంధ్రవాలా వంటి సినిమాలను తీసిన ఆయన ప్రభాస్ సినిమా విషయంలో ఎన్టీఆర్ మాట్లాడి చెడగొట్టాడు అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రభాస్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయాలని ప్లాన్ చేసి కథ ప్రభాస్ కి చెబితే ప్రభాస్ అలాగే ఆయన తండ్రి సూర్య నారాయణ రాజు కూడా కథ నచ్చి ఓకే చేశారట. అడ్వాన్స్ ఇవ్వబోతే ఇవాళ అష్టమి వద్దు అని చెప్పి సూర్యనారాయణ రాజు గారు అనడంతో వెనక్కి వచ్చారట గిరి.

ప్రభాస్ తో రోజూ టచ్ లో ఉండి ఆ సినిమా లో సీన్స్ అనుకుని నవ్వుకునేవారట గిరి. అయితే మరుసటి రోజు ఉదయం కాల్ చేసి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఈ సినిమా చేయడం లేదని చెప్పారట. దశమి నాడు అడ్వాన్స్ తీసుకెళ్తే సినిమా వద్దని చెప్పాను కదా అని అన్నారట సూర్యనారాయణ రాజు. అయితే రాత్రికి రాత్రి ఏమి జరిగింది, ఎందుకు సినిమా వద్దనుకున్నారో చాలా సేపటికి కానీ ఆయన చెప్పలేదట. ఎన్టీఆర్ ఫోన్ చేసి సినిమా చేయొద్దని చెప్పారట ప్రభాస్ కి. ఎన్టీఆర్ కు ఆవుల గిరికి బాగా తెలిసిన కొంతమంది ఎన్టీఆర్ ను ముందుకు పెట్టి తన మీద చెప్పించారంటూ ఆవుల గిరి కామెంట్స్ చేసారు.