Babu Gogineni: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాంకర్ దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదురుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది ఎవరు క్షమాపణ చెప్పాలి అనే విషయం గురించి పెద్ద ఎత్తున పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు దేవి నాగవల్లికి మద్దతు తెలపడం మరికొందరు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేస్తూ క్షమాపణ చెప్పాలి అనే విషయం వెల్లడించారు.

ఈ సందర్భంగా బాబు గోగినేని మాట్లాడుతూ… విశ్వక్ సేన్ యాంకర్ ను అనకూడని మాట అన్నారు. అయితే ఈ వీడియో మాత్రమే విడుదల అయింది.విశ్వక్ సేన్ ఆ మాట అనడానికి ముందు యాంకర్ ఎలాంటి మాటలు మాట్లాడరు అనే విషయం గురించి వీడియో లేదు.

విశ్వక్ సేన్ తన ఫ్రాంక్ వీడియో డిబేట్ లో దేవి నాగవల్లి ఆయనని పాగల్ సేన్, డిప్రెషడ్ అంటూ సంబోధించారు. ఇలా మాట్లాడటం ఇండియన్ మెంటల్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు. యాంకర్ అలా మాట్లాడటంతో పదేపదే విశ్వక్ సేన్ మాటలు అదుపులో ఉంచుకొని డిప్రెషడ్ గురించి మాట్లాడే హక్కు లేదని తెలియజేశాడు.
విశ్వక్ సేన్ మాటలు నచ్చలేదు యాంకర్ తనని స్టూడియో నుంచి బయటకు వెళ్ళమని అరిచారు. ఆ సమయంలో హీరో విశ్వక్ సేన్ F*** అనే అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. అసలు ఆయనని డిబేట్ ఆహ్వానించింది టీవీ9 వాళ్ళు రమ్మని ఆయన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతూ బయటికి వెళ్ళడం తప్పు.
ఇలా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీ9 డిలీట్ చేసింది. అయితే ఈ వ్యవహారం జరగడానికి కారణం దేవి నాగవల్లి తనని డిప్రెషడ్ గెటవుట్ అనటం వల్లే తలెత్తింది. ఇక దేవి నాగవల్లి విశ్వక్ అన్న మాటలకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ డీజే టిల్లు సమయంలో దేవి నాగవల్లి ‘మీరు ఉమనైజరా? అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.
జర్నలిజం అనలేం…
స్టూడియోలో విశ్వక్‌సేన్ విషయంలో దేవి నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పాలి. చివరికి దేవి నాగవల్లి చేసిన దాన్ని జర్నలిజం అనలేం అంటూ బాబు గోగినేని ఈ వ్యవహారంపై స్పందించారు.
































