Babu Gogineni: హేతువాది బాబు గోగినేని గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏ విషయం గురించైనా మాట్లాడితే ఆ విషయం ఎన్నో వివాదాలకు కారణం అవుతుందని అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో విషయాల ద్వారా పలు వివాదాల్లో ఉన్న బాబు గోగినేని తాజాగా రాధేశ్యామ్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో సుమారు 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను చేరుకోలేక అభిమానులను ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పాలి.

అయితే ఈ సినిమాపై బాబు గోగినేని ఆసక్తికరమైన వాక్యాలు చేశారు.ఈ సినిమాపై బాబు గోగినేని స్పందిస్తూ ఈ సినిమాలో కృష్ణంరాజు చెప్పే మాటలలో ఎన్నో ఆ పదాలు ఉన్నాయి. కృష్ణం రాజు ఒక సన్నివేశంలో కెప్లర్ గురించి చెబుతారు ఆ మాటలు అన్నీ కూడా అబద్ధం అసలు విషయం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం నుంచి పుట్టిన చిన్న ఫూలిష్ బేబీ అని కెప్లెర్ చెప్పినట్లు అంటూ బాబు గోగినేని చెప్పారు.
ఇలా ఈ సినిమాలో చెప్పిన వన్నీ అబద్ధాలు అంటూ చెప్పడమే కాకుండా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా కూడా వాట్సాప్ మెసేజ్ లు చూసి డైలాగులు రాస్తాడా? సినిమా తుస్ అంట కదా…ఈ సినిమా చూసే ముందు మేకర్స్ ఒకసారి విక్రమాదిత్యతో వారి అదృష్టం ఎలా ఉందో చూపించుకోవాల్సి ఉండేది అంటూ పరోక్షంగా సినిమా పై సెటైర్లు వేశారు. ఇలా బాబు గోగినేని ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































