Babu Mohan : ఆహుతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్, ఆ తరువాత వచ్చిన మామగారు సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసిన బాబు మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తెరాసలో చేరిన బాబు మోహన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

ఎన్టీఆర్ కు కెసిఆర్ కూడా వెన్నుపోటు పొడిచాడు…
టీడీపీ నుండి తెరాస ఆ తరువాత ఇప్పుడు బీజేపీ లో ఉండటం గురించి మాట్లాడిన బాబు మోహన్ గారు, టీడీపీ లో రాష్ట్రాలు విడిపోయాక కూడా ఉన్నాను అయితే ఆ సమయంలో కెసిఆర్ ఫోన్ చేసి పార్టీనే లేదు ఇంకా అక్కడ ఏం చేస్తావ్ నా పార్టీలోకి రా అని పిలిస్తే స్నేహం కోసం వెళ్ళాను. టికెట్ ఇచ్చాడు గెలిచాను కానీ రెండో సారి నాకు ఇవ్వలేదు. కనీసం ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పలేదు. దాంతో బీజేపీలోకి చేరిపోయాను. టీడీపీ, బీజేపీ రెండూ ఒకే పార్టీనే, నా దృష్టిలో రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు, తెలంగాణ రాక ముందు వరకు రెండూ కలిసే ఉన్నాయి.

ఇక తెరాస లో ఉన్న వాళ్లంతా టీడీపీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళే మరి ఇవన్నీ వేరే పార్టీలు ఎలా అవుతాయి. కాంగ్రెస్ మాత్రమే వేరే పార్టీ అంటూ వివరించారు. ఇక ఎన్టీఆర్ ను గద్దె దించి చంద్రబాబు సీఎం అయినపుడు ఆయన టీంలో కెసిఆర్ కూడా ఉన్నాడు. వెన్నుపోటు ఎపిసోడ్ లో కెసిఆర్ కూడా భాగమే కదా, చంద్రబాబుకు కెసిఆర్ శిష్యుడే కాదు ఆయనో మేధావి, మొండి పట్టు వదలడు. అయితే ఈయన మేధావే కాకపోతే ఒంకర టింకరగా ఏ పని అయినా సాధిస్తాడు అంటూ చెప్పారు బాబూమోహన్.