Babu Mohan: చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాం.. మా నాన్న ఎక్కడున్నారో తెలియదు… స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!

0
86

Babu Mohan:బాబు మోహన్ పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తన నటనతో అందరిని మెప్పించిన ఈయన ప్రస్తుతం సినిమాలలో నటించకుండా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి బాబు మోహన్ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం జీ తెలుగులో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బాబు మోహన్ పిల్లలు వేసినటువంటి ఒక స్కిట్ చూసి స్టేజ్ పైన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి స్కిట్ చేశారు.

ఇది చూసినటువంటి బాబు మోహన్ తన ఫ్యామిలీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… నాకు మాట్లాడటానికి కూడా రావడం లేదు అంటూనే ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి కష్టాలన్నీ అనుభవించాము నేను మూడో తరగతిలో ఉన్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది అప్పటికి నాకు ఒక చిన్న చెల్లి కూడా ఉంది తనకు నేనే జడలు వేసి అన్నం తిని పెట్టి అన్ని పనులు చూసుకునేవాడిని.

Babu Mohan:

ఇక నాన్న మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు అలాంటి సమయంలో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగామని ఈ సందర్భంగా బాబు మోహన్ తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ ప్రోమో చూసిన వారందరూ అందరిని తెరపై నవ్విస్తూ ఉండే బాబు మోహన్ జీవితంలో ఇంత కన్నీటి గాధ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.