బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నా.. ఇది నిజమేనా అంటూ ఎంతోమంది సందేహాలను వ్యక్తపరచారు. ఏ ఛానల్‌లో అని కొందరు ఆరా తీశారు. ఏ షోకి.. ‘బిగ్ బాసా’.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోనా.. ‘నంబర్ 1 యారి’ షోకు హోస్ట్ చేయబోతున్నారా.. ఇలా నందమూరి అభిమానుల్లో ఒకటే ఆతృత. అయితే బాలయ్య హోస్ట్ అంటే అభిమానులు ఎంతగా ఎగ్జైట్ అయ్యారో.. కొందరు యాంటీ ఫ్యాన్స్ అంతగా నెగిటివ్ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ఎప్పుడైతే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన – మన తెలుగు ఓటీటీ ఆహా కోసం బాలయ్య హోస్ట్ చేయబోతున్నారని కన్‌ఫర్మ్ చేస్తూ ప్రకటించారో షాక్ తిన్నవారూ చాలామంది.

అయితే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ హోస్ట్‌గా అన్ స్టాపబుల్ షో ప్రోమో వచ్చాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలో ఎంత ఎనర్జీగా కనిపించారో అంతకంటే రెట్టింపు ఎనర్జీతో అన్ స్టాపబుల్ షోలో బాలయ్య కనిపించి ఆశ్చర్యపరచారు. చెప్పాలంటే ఓ రకంగా బాలయ్య ఇప్పటి వరకు హోస్ట్ చేసిన వారిని చాలా వరకు డామినేట్ చేశారనే చెప్పుకున్నారు. ఈ షో చేసినందుకు బాలయ్య అందుకుంటున్న రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే. అయినా బాలయ్యకు హోస్ట్‌గా కూడా చేసి తన స్టామినాని చూపించుకోవాలి.

పైగా ఇలాంటి షోలో ఎప్పుడూ బాలయ్య చేయలేదు కాబట్టి ఆయనకి ఓ సరదా కూడా తీరినట్టుటుంది. అదే బాలయ్య అన్ స్టాపబుల్ చేయడానికి కారణం అయింది. ఇక ఎంత సరదాగా తీసుకున్నా బాలయ్య ఎపిసోడ్ విషయంలో మాత్రం సినిమాకు కష్టపడినట్టే కష్టపడ్డారు. అంతక ముందు స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ అనే సెలబ్రిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. కానీ, సమంత హోస్ట్‌గా ఫెయిల్ అయిందనే టాక్ వినిపించింది. ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు అతిథులుగా వచ్చారు. అయితే సమంత హోస్ట్ చేయడం సరిగా చేతకాక షో ఫ్లాపయింది.

దాంతో సమంత సామ్ జామ్ ను మధ్యలోనే ఆపేశారు. కానీ బాలయ్య మాత్రం హోస్ట్‌గా సూపర్ సక్సెస్ అయ్యారు. ముందు అనుకున్న ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు ఎపిసోడ్స్ పెరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఇందులో గెస్టులుగా వచ్చి బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఈ షో ద్వారా అల్లు అరవింద్‌కు మంచి లాభాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ కంటిన్యూ అవుతోంది. నాని హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2 అంతగా సక్సెస్ కాలేదు. నానికి మైనస్ మార్కులే పడ్డాయి.

ఇక తాజాగా కంప్లీట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5కి కూడా నాగార్జున కొంతవరకు మైనస్ అనే టాక్ వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్.టి.ఆర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కంప్లీట్ అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు కూడా తారక్ బాగా సక్సెస్ చేశాడు. నంబర్ 1 యారీతో రానా కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఒక్కసారి హోస్ట్‌గా చేసిన చిరు మళ్ళీ కనిపించలేదు. ఇక మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మీ చేసిన షోలు బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు మాత్రం బాలయ్య బాగా సూటయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇకపై కూడా బాలయ్య పలు క్రేజీ షోస్‌కు హోస్ట్‌గా చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.


































