తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించిన బాలాదిత్య 2003 సంవత్సరంలో
బి.జయ దర్శకత్వంలో “చంటిగాడు”సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.తన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఇండస్ట్రీలో వరుసగా సుందరానికి తొందరెక్కువ,1940 లో ఒక గ్రామం వంటి సినిమాల్లో నటించాడు.ఆయన నటించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇటీవలే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలాదిత్య సినిమాలతో పాటు టివి వ్యాఖ్యాతగా, పలు సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చంటిగాడు మూవీలో హీరో బాలాదిత్యకు జంటగా నటించిన అచ్చ తెలుగు అమ్మాయి సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.తాజాగా బాలాదిత్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.సుహాసిని చాలా మంచి అమ్మాయి. నాకు మంచి స్నేహితురాలు అంతే కానీ తాము పెళ్లి చేసుకోబోతున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు.

గతంలో సుహాసినితో కలిసి దాదాపు రెండు సినిమాల్లో నటించడం జరిగింది. మేము ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో ప్రయాణించేవాళ్లమని, అలాగే ఎంతో సరదాగా మాటలు చెప్పుకుంటూ టైం పాస్ చేసే వాళ్ళం. ఇలా మామధ్య ఉన్న స్నేహ బంధాన్ని తప్పుగా అనుకుని కొందరు తమ ఇష్టానుసారం పత్రికల్లో మా మీద అనవసరపు వ్యాఖ్యలు చేశారు అంటూ మండిపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here