Baladitya: బిగ్ బాస్ 9 వారాలను పూర్తిచేసుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్లను బయటకు పంపించారు.ఇక పదవ వారంలో భాగంగా 9 మంది నామినేషన్స్ లో ఉండగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించి శనివారం ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపించారు. అలాగే ఆదివారం మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కానున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే శనివారం నాగార్జున హౌస్ మెట్లతో ఎంతో సరదాగా ముచ్చటిస్తూ వారి చేత ఒక టాస్క్ నిర్వహించారు. టాస్క్ అనంతరం ఎలిమినేషన్ సమయం వచ్చింది అంటూ నామినేషన్ లో ఉన్న వారి నుంచి బాలాదిత్యను ఎలిమినేట్ చేశారు.ఈ విధంగా బాలాదిత్య ఎలిమినేట్ అని చెప్పడంతో ఆయన ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఎలాంటి ఓవరాక్షన్ చేయకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా బిగ్ బాస్ నిర్ణయాన్ని గౌరవించి బయటకు వచ్చారు.
ఇలా బిగ్ బాస్ నుంచి ఎలాంటి ఎమోషన్స్ లేకుండా వేదిక పైకి రావడమే కాకుండా కంటెంట్ లందరికీ తనదైన శైలిలో సూచనలు ఇచ్చారు..ఇక ఈయన హౌస్ లో కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో అర్థవంతంగా వివరణ ఇస్తూ వివరించడంతో కొంతమందికి ఇతని వ్యవహార శైలి నచ్చలేదు. తద్వారా ఈయన ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది.

Baladitya మెచ్యూర్డ్ మైండ్ అంటూ ప్రశంసలు…
ఇక అందరిలాగే ఈయన ఏమాత్రం ఎమోషనల్ కాకుండా బిగ్ బాస్ ఎలిమినేషన్ అని ప్రకటించగానే చక చక ఇంటి నుంచి బయటకు వచ్చారు.అయితే హౌస్ లో కొనసాగుతున్న సమయంలో బాలాదిత్య ఒక్క నెగిటివ్ మార్కు కూడా తనపై వేసుకోకుండా పూర్తిగా పాజిటివ్ గా బయటకు వచ్చి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు.ఇక బాలాదిత్య ఎలిమినేట్ కావడంతో అభిమానులు కూడా ఓకింత షాక్ కి గురయ్యారు. ఇక నేడు బిగ్ బాస్ హౌస్ నుంచి వాసంతి ఎలిమినేట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.





























