Balagam Movie: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఊహించని దానికన్నా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది.

ఈ విధంగా బలగం సినిమా ఎంతో సక్సెస్ సాధించింది అయితే తెలంగాణలో ఏదైనా సర్కారు ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నట్లయితే తప్పకుండా ఆ పరీక్ష పత్రాలలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు రావడం గమనార్హం గతంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష పత్రాలలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించారు. ఈ గ్రూప్ 4పరీక్ష పత్రాలలో భాగంగా మరోసారి బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న రావడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇలా గ్రూప్ ఫోర్ పరీక్ష పత్రంలో తమ సినిమా ప్రశ్న రావడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఏ ప్రశ్న పరీక్ష పత్రాలలో వచ్చినది అనే విషయానికి వస్తే…

Balagam Movieహర్షం వ్యక్తం చేస్తున్న చిత్ర బృందం…
బలగం చిత్రానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి? అనే ప్రశ్నకు ఏ. దర్శకుడు : వేణు యెల్దండి, బి. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి సి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, డి. కొమురయ్య పాత్రను పోషించినవారు : అరుసం మధుసూదన్. దీనికి సమాధానం ఏ,బీ,సీ, ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించి ఈ ప్రశ్నను అడగడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































