Balakrishana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ నటించిన. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మిశ్రమ ఫలితాలు అందుకుంటుంది. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది.
ఇదిలా ఉండగా సినిమాలలో బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగులు ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. బాలయ్య ఇలా అద్భుతంగా డైలాగులు చెప్పటమే కాకుండా పురాణాల గురించి మంచి అవగాహన ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని బాలయ్యని డిమాండ్ చేస్తున్నారు.
వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ ఒక సందర్భంలో దేవబ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు దేవళ మహర్షి గురువు. వారి నాయకుడు రావణాసురుడు అని చెప్పాడు. అయితే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు ఖండిస్తున్నారు. దేవళ మహర్షి నాయకుడు రావణాసురుడని చెప్పి బాలకృష్ణ ఆ చరిత్ర ను వక్రీకరించారు.

Balakrishana: దేవాంగులను అవమాన పరుస్తూ మాట్లాడిన బాలయ్య..
దేవాంగుల కుల గురువు దేవళ మహర్షి. కుల దైవం చౌడేశ్వరీ అమ్మవారు. దేవాంగ కుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడి ఉంది. దేవాంగ కులాన్ని కించపరిచేలా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ఆ కులస్తులకు క్షమాపణలు చెప్పాలని దేవాంగ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదం పై స్పందించిన బాలకృష్ణ దేవంగ కులస్తులకు క్షమాపణలు చెప్పారు ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని ఈయన క్షమాపణలు తెలియజేశారు.
































