Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. మరోవైపు రాజకీయాలలో కూడా దూసుకుపోతున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఘనవిజయం సాధించారు.

ఇలా తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈయన ఇప్పటివరకు మంత్రి పదవులు అందుకోలేదు. అయితే మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన పూర్తిగా మంత్రి పదవికి అర్హుడని చెప్పాలి.
ఇక మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలిచిన బాలయ్య ఈసారి ఏపీ క్యాబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయనకు ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే బాలయ్య సినిమాలలో కూడా నటుడిగా మంచి సక్సెస్ అయ్యారు. కనుక ఈయనకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ రూపు రేఖలు మారుతాయి..
సినీ రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి బాలకృష్ణకు ఇదే మంత్రి ఇస్తే కనుక చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రూపురేఖలు మొత్తం మార్చేస్తారని బాలయ్యకు ఈ మంత్రి పదవి సరైనదని తెలుస్తుంది. మరి బాలయ్యకు మంత్రి పదవి రావడం పట్ల త్వరలోనే అధికారక ప్రకటన చేయనున్నారు.





























