Balakrishna: నందమూరి నట సింహం,హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఈయన నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే బాలయ్య అభిమానులను పార్టీ కార్యకర్తలను పలకరించడం కోసం ప్రచార వాహనంలో బయలుదేరారు .

ఈ విధంగా బాలయ్య ప్రచార వాహనంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఈయన అభిమానులకు అభివాదం చేస్తున్న నేపథ్యంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.అభిమానులకు నమస్కరిస్తుండగా ఒకసారిగా ప్రచార వాహనం ముందుకు కదలడంతో బాలకృష్ణ వెనక్కి కుప్పకూలిపోయారు.
ఇలా బాలయ్య వెనక్కి పడిపోతుండగా అప్రమత్తమైన పార్టీ నేతలు కార్యకర్తలు బాలయ్యను కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో ఈయనకు పెద్ద ప్రమాదం తప్పింది.ఇలా ఒక్కసారిగా బాలయ్య వెనక్కి వాలడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈయనకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Balakrishna: అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య…
ఇక ఈ పర్యటనలో భాగంగా బాలయ్యకు అక్కినేని వివాదం గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అక్కినేని వివాదం పై స్పందించిన బాలయ్య ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వారని తన బాబాయ్ పై ప్రేమ గుండెల్లో అలాగే ఉంది. నేనెందుకు తనను విమర్శిస్తాను అంటూ అక్కినేని వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
BREAKING: హిందూపురంలో ప్రచార వాహనంపై నుంచి పడబోయిన బాలకృష్ణ.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో తుళ్లి వెనక్కి పడిపోయిన బాలకృష్ణ..#Balakrishna #NandamuriBalakrishna #Hindupur #TDP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/i9TdWSme5A
— NTV Telugu (@NtvTeluguLive) January 26, 2023




























