Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నరసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీగా నిలుస్తున్నాడు.

అంతేకాకుండా మరొకవైపు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇదిలా ఉండగా బాలకృష్ణకు కోపం ఎక్కువ అనే వార్తలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆయనతో పని చేసే తోటి నటీనటులు దర్శకులు మాత్రం బాలయ్య మనసు బంగారం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు వైద్యం అందిస్తూ ఎందరికో ప్రాణదాతగా నిలుస్తున్నాడు.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇంతకాలం వరుస ప్లాపులు ఎదుర్కొన్న బాలకృష్ణ అఖండ సినిమా ద్వారా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna: ఐదు కోట్లు పెంచేసిన బాలయ్య…
ఇంతకాలం ప్లాపులతో ఉన్న బాలయ్య పదికోట్ల లోపే రెమ్యూనరేషన్ అందుకునేవాడు. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే బాలయ్య రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. అంతేకాకుండా రెమ్యూనరేషన్ గురించి బాలయ్య పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అయితే ఇటీవల వరుస హిట్లు అందుకోవడంతో అందరిలాగే బాలయ్య కూడా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అఖండ సినిమా తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి కోసం 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడని, ఇక ఆ సినిమా మంచి హిట్ అవ్వటంతో ప్రస్తుతం నటిస్తున్న భగవంత్ కేసరి కోసం ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక తదుపరిచిత్రాన్ని బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు ఈ సినిమా కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.


































