నందమూరి బాలకృష్ణ హోస్టగా చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపాబుల్. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ షోతో ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. అంత బాగా హోస్ట్ చేస్తారని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. అందరి అంచనాలను తారుమారు చేశారు.

ఎప్పుడూ బాలయ్య గురించి వార్తలు వచ్చినా.. సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్లు.. కానీ గత రెండు మూడు వారాల నుంచి ఈ షో గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణలో ఈ యాంగిల్ కూడా ఉందనేది ఈ షో ద్వారానే తెలిసింది. దీంతో అతడి పాపులారిటీ అంతకు అంత పెరిగిపోయింది. దీంతో అతడికి అల్లు ఫ్యామిలీ బంధం ఇంకా మెరుగుపడింది.
అందుకే ఇటీవల అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ను గెస్ట్ గా పిలిచారు. ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో షో కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. శుక్రవారం తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ‘మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఆహా’ టీం మూడో ఎపిసోడ్‌లో బాలయ్య పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#NandamuriBalakrishna Garu is back with his trademark energy to set your screens ablaze with great conversations and celebrations ????#UnstoppableWithNBK episode 3 coming this week on @ahavideoIN Promo soon.#MansionHouse @tnldoublehorse @swargaseema pic.twitter.com/f3dIixyTxt
— BA Raju's Team (@baraju_SuperHit) November 29, 2021
ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో హంగామా చేశారు. ఇక నిన్న ఈ షోకి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. దానిలో బాలయ్య ఇలా చెబుతూ మొదలవుతుంది.. ‘మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. ఎన్నో మెసేజెస్, ఎన్నో ఫోన్ కాల్స్.. నేనెలా ఉన్నానని కాదు.. మూడో ఎపిసోడ్ ఎప్పుడా అని.. వారం వారం రావడానికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్’.. అంటూ బాలయ్య తన స్టైల్ ఎనర్జీతో అలరించారు. త్వరలో మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వారం గెస్ట్ ఎవరనే దానిపై ప్రతి ఒక్కరికీ ఉత్కంఠగా మారింది.































