Balakrishna & NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం బీమ్ గా ఎన్టీఆర్ నటన అందరిని ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు.ఇక కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటన అందరిని కంటతడి పెట్టించింది. ఆ పాటలో ఎన్టీఆర్ నటన తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గా చెప్పొచ్చు. ఇక బాబాయ్ బాలకృష్ణ కూడా కొమరం భీముడిగా నటించారనే విషయం చాలా మందికి తెలియదు.

పరమవీరచక్ర లో కొమరం భీముడు….
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన పరమ వీర చక్ర సినిమాలో బాలకృష్ణ కొమరం భీముడిగా నటించారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందింది. అందువల్ల చాలా మందికి బాలకృష్ణ కొమరం భీమ్ గా నటించారనే విషయం తెలియదు. ఇక అబ్బాయ్ మాత్రం కొమరం భీమ్ గా నటించి మెప్పించాడు. ఇలా బాబాయ్ చేయలేనిది అబ్బాయ్ చేసేసాడు మరీ. ఇక కొమరం బీమ్ ను కొత్తగా తెరపై చూపించలేదు.అల్లాణి శ్రీధర్ అనే దర్శకుడు కొమరం భీమ్ చరిత్ర సినిమాగా తీశారు.
































