Balakrishna: నందమూరి హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే బాలకృష్ణ ఎక్కడైనా మీడియా సమావేశాలలో పాల్గొన్న లేదంటే సినిమా కార్యక్రమాలలో పాల్గొన్న ఎక్కువగా తన తండ్రి ఎన్టీ రామారావు గురించి మాత్రమే మాట్లాడతారు.

ఇలా తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పే ఈయన తన తల్లి బసవతారకం గురించి మాట్లాడటం చాలా తక్కువ. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మొదటిసారి తన తల్లి బసవతారకం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మేము 13 మంది సంతానం అయితే మేము కాస్త పెరిగి పెద్దయిన తర్వాత హైదరాబాదులో ఉన్నాము కానీ అమ్మ నాన్నతోనే మద్రాస్ లో ఉండేదని తెలిపారు.
అప్పుడప్పుడు మమ్మల్ని చూడటానికి వచ్చేవారు అయితే నాన్న సినిమాలలో నటిస్తూ ఉండటం వల్ల అమ్మ అక్కడే ఉంటూ నాన్నకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేసేవారు ఉదయం 3 గంటలకు లేసి నాన్న షూటింగ్ వెళ్లే సమయానికి తనకు కావలసినవన్నీ తయారు చేసి పెట్టేది ఇలా సాయంత్రం నాన్న వచ్చి ఏం కావాలని అడిగితే అది చేసి పెట్టేది.
కుటుంబం కోసం..
ఇలా తండ్రి విజయం వెనుక నా తల్లి ఉందని చెప్పడం నేను ఎంతో గర్వపడతానని తెలిపారు. ఇలా అమ్మ 13 మంది పిల్లలు అలాగే కుటుంబాన్ని చూసుకుంటూ తన జీవితం మొత్తం కుటుంబం కోసం, నాన్న కోసం త్యాగం చేసిన పుణ్యాత్మురాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. అన్ని సద్గుణాలు కలగలిపిన ఒక మహోన్నతమైన వ్యక్తి అమ్మగారు అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య.



























