Balakrishna son-in-law Sri Bharath : రెండు రాష్ట్రాలలోనూ ఎండలు మండి పోతున్న వేళ రాజకీయాల్లో కూడా వేడి మొదలయింది. పార్టీలన్నీ వచ్చే ఎన్నికల కోసం అపుడే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లు గా ప్లాన్ చేస్తుంటే మధ్యలో జనసేన నేనున్నానంటూ చెబుతోంది. మూడు పార్టీల ఆటలో ఈసారి విజయం ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక టీడీపీ నుండి నారా లోకేష్ ఇప్పటికే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా చురుగ్గా రాజకీయ మీటింగులకు హాజరవ్వుతూ ఉన్నారు. ఆయన ఈసారి విశాఖ ఎంపీగా బరిలో దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తారకరత్నకి గుండె పోటు సమయంలో నేనున్నాను…
ఇటీవలే నందమూరి మోహన్ కృష్ణ కొడుకు హీరో తారకరత్న కుప్పం పాదయాత్రలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆపైన 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స చేసినా లాభం లేకుండా పోయింది, ఆయన మరణించారు. అయితే ఆయన పాదయాత్ర రోజున ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు వంటి విషయాలను శ్రీ భరత్ వివరించారు. తారకరత్న గారిని ఈ పదేళ్లలో ఒక నాలుగు సార్లు కలిసుంటాను. కలిసినపుడు చాలా బాగా మాట్లాడుతారు. తనని బావ అని ఎప్పుడూ పిలవలేదు. అన్న అని పిలవడమే అలవాటు. పాదయాత్ర రోజు ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాము లోకేష్ దగ్గరికి తాను వెళ్ళిపోయాడు నేను వెనుక ఉండిపోయాను.

వాళ్ళు ఒక దర్గా లోపలికి వెళ్లగా నేను ముందుకు వెళ్ళిపోయాను. ఘటన 11 గంటల సమయంలో జరుగగా నాకు దాదాపు 2 గంటల ప్రాంతంలో తెలిసింది. అక్కడే మొదట చికిత్స అందించిన హాస్పిటల్ కి వెళ్ళాను, ఆ తరువాత బెంగళూరుకి తరలించారు. అక్కడ 23 రోజులు చికిత్స అందించారు. కుప్పంలో హాస్పిటల్, బెంగళూరు హాస్పిటల్స్ రెండూ కూడా మంచి పేరు ప్రాఖ్యాతలున్న హాస్పిటల్స్, వాళ్లెందుకు చనిపోయిన వ్యక్తికి చికిత్స అందిస్తారు అవన్నీ ఆరోపణలే. ప్రభుత్వం అలాంటి పనులు చేయింస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళు అలానే చేస్తారని బురద జల్లుతున్నారు అంతే అంటూ వివరించారు.































