నందమూరి బాలకృష్ణ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా వేదికగా బాలకృష్ణ
ఆన్ స్టాపబుల్ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు ఎపిసోడ్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. బాలకృష్ణ చేతికి గాయం కావడం వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమం తిరిగి మూడవ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

మూడవ ఎపిసోడ్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్రహ్మానందం వస్తున్నట్లు నిర్వాహకులు ప్రోమో ద్వారా వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగవ ఎపిసోడ్ లో రానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇప్పటికే మహేష్ బాబు ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆన్ స్టాపబుల్ వేదికపై బాలకృష్ణతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ..ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలకృష్ణతో కలిసి ఈవినింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా మహేష్ బాబు బాలకృష్ణ ఇద్దరిని కలిపి ఒకే వేదికపై చూడడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై వస్తున్నారని తెలియడంతో ఇటు నందమూరి అభిమానులు ఇటు మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.






























