Balakrishna – Vasundara: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ఐదవ సంతానంగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన వసుంధర దేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం 1982 డిసెంబర్ 8వ తేదీ తిరుమల తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగింది.

ఎన్టీఆర్ బాలకృష్ణ కోసం కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యారావు-ప్రమీల రాణిల ద్వితీయ కుమార్తె వసుంధరాదేవి నిచ్చి 8-12-1982 బుధవారం పగలు 12.41 నిమిషాలకు ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. ఇక డిసెంబర్ 8వ తేదీ వీరి వివాహ దినోత్సవం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరోకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ వసుంధర దేవి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందమూరి అభిమానులు ఈ పెళ్లి పత్రికను మరింత వైరల్ చేస్తున్నారు. బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కూడా రాణిస్తున్నారు.

Balakrishna -Vasundara: మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల ఎదురుచూపులు..
ఇక బాలకృష్ణకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తె బ్రాహ్మిని చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కి ఇచ్చి వివాహం చేయగా రెండవ కుమార్తె తేజస్విని ఒక బిజినెస్ మెన్ కి ఇచ్చే వివాహం చేశారు. ఇక కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుందని ఇదివరకు బాలయ్య ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
































