బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తుండగానే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాలకృష్ణ తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.

నేడు హైదరాబాద్లో ఎంతో ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివి వినాయక్ కొరటాల శివ, హరీష్ శంకర్, బోయపాటి, బుచ్చిబాబు, బాబీ మొదలైన డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం వివి వినాయక్ క్లాప్ కొట్టగా బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు.
గోపీచంద్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్నటువంటి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొన్నారు.NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాకు గోపీచంద్ ఎలాంటి టైటిల్ ను పెడతారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే బోయపాటి బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.






























