నందమూరి నటసింహం బాలకృష్ణ చూడటానికి ఎంతో గంభీరంగా అనిపించినా, అతను మనసు మాత్రం మంచిదని ఎన్నోసార్లు నిరూపితమైంది. కేవలం తనకు నచ్చని పనులు చేస్తే మాత్రం బాలయ్య తన విశ్వరూపాన్ని చూపిస్తారు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే బాలకృష్ణ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ఆహా ఓటీటీలో ‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె ‘ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అందుకుగాను బాలకృష్ణ సుమారుగా 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 12 ఎపిసోడ్లు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో బాలయ్యకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం.బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీదుగా క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బసవతారకం ఆసుపత్రికి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు.
ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ఆస్పత్రిలోని పేషెంట్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ప్రకటన చేయబోతున్నారు ఇండస్ట్రీలో సమాచారం.































