Bandhavi Sridhar: సాధారణంగా ఒక సినిమాలో ఏదైనా ఒక పాత్ర అద్భుతంగా పండింది అంటే ఆ పాత్ర గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెడతారు.ఆ పాత్రలో నటించిన నటి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత కనబరుస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హర్రర్ చిత్రం మసూద.

ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురిచేసింది. ఇక ఈ సినిమాలో నాజియా క్యారెక్టర్, మసూద క్యారెక్టర్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో నాజియా క్యారెక్టర్ లో నటించిన నటి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. అయితే నాజియా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు బాంధవి శ్రీధర్.
గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనంతరం మసూద సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి.. అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలబడ్డారు. ఇక తన తండ్రి గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయటం వల్ల తనకు కూడా నటనపై ఆసక్తి కలిగిందని వారి ప్రోత్సాహంతోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లానని తెలిపారు.

Bandhavi Sridhar: మిస్ ఇండియా రన్నర్ గా నిలిచిన బాంధవి శ్రీధర్..
ఇక తాను ఇదివరకు ఎలాంటి షార్ట్ ఫిలిమ్స్ సీరియల్స్ లోను నటించలేదని తన ఫస్ట్ సినిమా మసుదా కావడం విశేషం అని తెలిపారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కాకపోయినా పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని బాంధవి శ్రీధర్ వెల్లడించారు.ఇక ఈ సినిమా ద్వారా తనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని ఈ సినిమా అనంతరం తనకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని ఈమె తెలియజేశారు. మరి మసూద సినిమాలో మంచి పాత్రలో నటించిన బాంధవికి తరువాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే విషయం తెలియాల్సి ఉంది.



























