Bandla Ganesh: పొలిటికల్ రీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్… పొగరుగా రాజకీయం చేస్తా అంటూ కామెంట్స్!

0
24

Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట కమెడియన్ గా పలు సినిమాలలో నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. అంతేకాకుండా కొంత కాలం రాజకీయాలలో కూడా సందడి చేశాడు.

Bandla Ganesh: ఇదేంటి బండ్లన్నా.. దిల్ రాజుకు కొడుకు పుడితే మరో నిర్మాతకు విష్ చేశావు.. బండ్ల గణేష్ ను భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

రాజకీయాల్లో వర్కౌట్ కాకపోవటంతో రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. ఆ తర్వాత మళ్లీ నటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే సినిమాలలో సరైన అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చేసే పోస్టుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బండ్ల గణేష్ షేర్ చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రాజకీయాలకు స్వస్తి చెప్తున్నట్లు స్వయంగా ప్రకటించిన బండ్ల గణేష్ మరలా ఇప్పుడు పాలిటిక్స్ లో రీ ఎంట్రీ గురించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేస్తూ…’ రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే మరొక ట్వీట్ చేశాడు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా అంటూ పాలిటిక్స్ లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Bandla Ganesh: రాజకీయం అంటే నమ్మకం…


ఇక మరొక ట్వీట్ చేస్తూ…’ రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి.. రావాలి. అందుకే వస్తా ‘ అంటూ మరొక ట్వీట్ చేశాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటాను అని శబదం చేసిన బండ్ల గణేష్ ఇలా యూ టర్న్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇస్తా అనటంతో నెటిజన్ల వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.