Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

బండ్ల గణేష్ గత కొన్ని సంవత్సరాలు పాటు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంశల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలలో బెస్ట్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు ఆయన మిడిల్ క్లాస్ ముఖ్యమంత్రి అని తెలిపారు.

Bandla Ganesh: నేను కాంగ్రెస్..
తను ఎవరినైనా కలుస్తారు అలాగే తనని ఎవరు కలవడానికి అయినా అభ్యంతరం చెప్పరని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్న బిఆర్ఎస్ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఏ పార్టీకి కూడా మద్దతు తెలపలేదు నాకెంతో ఇష్టమైన చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీలు స్థాపించిన నేను కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు తెలిపాను. ఇక నా ప్రాణం పోయినా బిఆర్ఎస్ పార్టీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పనని నేను పక్కా కాంగ్రెస్ నేత అంటూ మరోసారి బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.































