Pitapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం తలనొప్పిగా మారిపోయింది. ఎన్నికలలో గెలిచిన కొద్ది రోజులకే అక్కడ ఆధిపత్యపోరు మొదలైంది. ఇంకా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయకముందే జనసేన టిడిపి వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల పిఠాపురం టీడీపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వర్మ కారుపై జనసేన నాయకులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంపీ ఉదయ తాలూకా మనుషులు తనపై హత్య ప్రయత్నం చేశారని వర్మ ఆరోపణలు కూడా చేశారు.అయితే తాజాగా మరోసారి ఈ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడింది.
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇరు వర్గాలు ఆందోళనకు దిగారు. ప్రఖ్యాత అపర్ణ దేవి ఆలయ బాధ్యతల కోసం టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏ పార్టీ వారు ఉంటే ఆ పార్టీ వారికే ఆలయ బాధ్యతలు నిర్వహణ ఇవ్వాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పట్టుబడుతున్నారు.
హత్యా ప్రయత్నం..
ఈ క్రమంలోనే టిడిపి అలాగే జనసేన పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడం సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇదే కాకుండా పిఠాపురం పాదగయా ఆలయానికి దగ్గరలో ఉన్న జనసేన ఫ్లెక్సీలు గుర్తు తెలియని దుండగులు చించేశారు. ఇలా పిఠాపురంలో జనసేన టిడిపి కార్యకర్తలు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరు పై నాగబాబు స్పందించారు అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని త్వరలోనే అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఈయన వార్నింగ్ ఇచ్చారు.





























