కాకరకాయ అనేపేరు వినగానే చాలామంది ముఖ కవళికలు మారిపోతాయి. కాకరకాయ రుచికి చేదుగా ఉండటం వల్ల చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. అయితే ఎవరైతే కాకరకాయను తినరో అలాంటి వారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారని చెప్పవచ్చు. కాకరకాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేసే సహజ సౌందర్య గుణాలు కూడా కాకరకాయలో దాగి ఉన్నాయని చెప్పవచ్చు. మరి కాకరకాయ ద్వారా మన చర్మ సౌందర్యానికి ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ముఖం పై మచ్చలు ఉన్నవారు కాకరకాయ ముక్కలను బాగా మిశ్రమంలా తయారు చేసుకొని ఈ మిశ్రమంలో కొద్దిగా కరివేపాకు మిశ్రమాన్ని జోడించి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ముఖ్యంగా మొటిమల సమస్యలతో బాధపడేవారు కాకరకాయలను కట్ చేసి వాటిని ఒక గుడ్డలో కట్టిన తర్వాత ఆ ముక్కల నుంచి రసం బయటకు వస్తుంది. ఈ కాకరకాయ రసం ముఖానికి రాసుకుని.. ఒక ఐదు నిమిషాల తరువాత మొహం శుభ్రం చేయడం వల్ల మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ పద్ధతిని తరచూ చేయడం వల్ల మొహంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి మొహం కాంతివంతంగా మెరుస్తుంది.
కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని కాటన్ బాల్స్ సహాయంతో మన మొహాన్ని శుభ్రపరుచుకోవడం వల్ల ముఖంపై ఏర్పడినటువంటి దుమ్ము, ధూళి కణాలు తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, అందానికి కూడా కాకర ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.