తల్లి కావడం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒక మహిళ తల్లి కాబోయే సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక రకమైన చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తీవ్రంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలోనే కొందరికి అలర్జీలు రావడం, చర్మంపై మచ్చలు ఏర్పడటం, మొటిమలు జుట్టురాలిపోవటం వంటి సమస్యలు అధికమవవుతాయి. ఈ విధంగా గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.

గర్భధారణ సమయంలో మన చర్మంపై వచ్చే మొటిమలు మచ్చలను తొలగించుకోవాలంటే మన చర్మాన్ని శుభ్ర పరచుకోవడమేకాకుండా, ఎక్స్ పోలిట్ చేయడం ఎంతో అవసరం.రసాయన రహిత క్లేన్సర్‌ని ఉపయోగించి క్లీన్ చేయడం చర్మానికి చాలా అవసరం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందంగా ఉంచుతుంది.
గర్భధారణ సమయంలో ఏర్పడే మచ్చలు, పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్కులను తగ్గించడం కోసం మాయిశ్చరైజర్ క్రీమ్స్ ను ఉపయోగించకుండా కేవలం కొబ్బరి నూనెను ఉపయోగించి మన చర్మాన్ని బాగా మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందటమే కాకుండా మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ చేయలేనివారు ఫేస్ మాస్క్ వేసుకోనీ చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. బ్లాక్ బ్యాక్ ఫేస్ మాస్క్ వేసుకోవడం ద్వారా చర్మం పై మూసుకుపోయిన చెమట గ్రంధులను శుభ్రం చేయడానికి ఎంతో దోహదపడుతుంది. అదే విధంగా చర్మం పై ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మం అందంగా కనిపించడానికి కారణం అవుతుంది. ఈ విధమైనటువంటి మూడు చిట్కాలను పాటించటం ద్వారా మహిళలు చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
































