Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత నాగచైతన్య విడాకులకు సరైన కారణం తెలియకపోయినా వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నో రకాలుగా వీరి విడాకుల కారణాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే సమంత పెళ్లి తర్వాత సంతోషంగా లేకపోవడానికి ఓ నిర్మాత కారణం అంటూ తాజాగా నోరు విప్పారు.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ కార్యక్రమం ఎంత ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.ఇప్పటికే బుల్లితెరపై ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ కు సిద్ధమైంది. అయితే ఏడవ సీజన్ ఈనెల ఏడవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంతా అక్షయ్ కుమార్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్ సమంతను ప్రశ్నించారు. పెళ్లి తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా సమంత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను పెళ్లి తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పెళ్లి తర్వాత జీవితం కేజీఎఫ్ సినిమాలా ఉంది…
మీరు తీసిన కభీ ఖుషీ కబీ ఘమ్‌లా సినిమాల పెళ్లి తర్వాత జీవితం ఉంటుందని భావించుకున్నాను అయితే నిజజీవితంలో పెళ్లి తర్వాత జీవితం కభీ ఖుషీ కబీ ఘమ్‌లా సినిమాలా కాకుండా కేజిఎఫ్ సినిమాలా ఉందంటూ ఈమె పెళ్లి తరువాత జీవితం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ప్రోమో లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సమంత పూర్తి ఎపిసోడ్ లో పెళ్లి గురించి ఇంకెన్ని విషయాలు బయటపెడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
































