పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎందుకంటే?

0
33

సాధారణంగా పెళ్లి వేడుక అంటే ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి ఇంటినిండా చుట్టాలు, పిల్లలు చేసే అల్లరి, పసందైన వంటకాలు ఇవన్నీ ఉంటేనే ఇన్ని రోజుల వరకు పెళ్లి అనే మాటకు అర్థం ఉండేది. కానీ గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి వ్యాపించడంతో పెళ్లి అనే మాటకు అర్థం మారిపోయింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, చడీ చప్పుడు కాకుండా, పెళ్లి జరుగుతున్న విషయం నాలుగో కంటికి తెలియకుండా పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎన్నో జంటలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒక్కటయ్యాయి.పెళ్లి తంతు కార్యక్రమం జరిగేటప్పుడు ఎన్నో పూజా కార్యక్రమాల అనంతరం వధువు చేత వరుడు పాదాలకు నమస్కారం చేయడం మనం చూస్తుంటాము. ఈ విధంగా ఎన్నో సంస్కృతి ఆచార వ్యవహారాలను పాటిస్తూ పెళ్లి వేడుక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ పెళ్లి వేడుకలో పెళ్ళి తంతు ముగిసిన తర్వాత ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

పెళ్లి తంతు కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరువురు దండలు మార్చుకున్న తరువాత వరుడు ఉన్నఫలంగా వధువు కాళ్ళపై పడి నమస్కారం చేశాడు. ఒక్కసారిగా వరుడు చేసిన ఈ పనికి పెళ్లికి వచ్చిన అతిథులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వరుడు మాట్లాడుతూ తన ఇంటిని తన వారిని వదులుకొని నా కోసం తన సంతోషం కోసం నా ఇంట అడుగుపెడుతూ, నా వంశాన్ని అభివృద్ధి చేయడం కోసం వస్తున్న ఆమె పాదాలకు నమస్కారం చేయడంలో తప్పేముందనీ ప్రశ్నించాడు.

ప్రస్తుతం ఈ విధంగా వరుడు వధువు కాళ్ళకి నమస్కరిస్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించింది. ఈ విధంగా తన జీవిత భాగస్వామి పట్ల ఎంతో అద్భుతంగా ఆలోచించిన వరుడు పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here