Shivaji: శివాజీ పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించినటువంటి ఈయన ఇటీవలే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే బిగ్ బాస్ కార్యక్రమంలో పెద్దన్నగా అందరికీ పెద్దదిక్కుగా ఉన్నటువంటి శివాజీ టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.

ఇక ఈయన బయటకు వచ్చిన తర్వాత బిగ్బాస్ కార్యక్రమంతో పాటు పలు విషయాలను ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా తెలియజేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. శివాజీ ఏ విషయమైనా చాలా ముక్కు సూటిగా మాట్లాడుతారు అనే సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే మీరు పవన్ కళ్యాణ్ వంటి వారితో కలిసి రాజకీయాలలోకి రావచ్చు కదా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు శివాజీ సమాధానం చెబుతూ మెగా ఫ్యామిలీలో హీరోలకు ఉన్నంత క్రేజ్ మరెవరికి లేదు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆయన తెలంగాణలో అయినా మెగా ఫ్యామిలీకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు అనుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవ్వాలి అనుకుంటే పెద్ద కష్టం కాదని తెలిపారు.
ఆ లోపం సరిదిద్దుకోవాలి…
పవన్ కళ్యాణ్ సీఎం కాలేకపోతున్నారు అంటే ఎక్కడో ఏదో చిన్న లోపం ఉంది ఆ లోపం ఏంటో తెలుసుకొని దానిని సరిచేసుకొని ముందుకు వెళితే తప్పకుండా సీఎం అవుతారు అంటూ ఈ సందర్భంగా శివాజీ మెగా ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































