ఏ సినిమాలోనైనా మేకప్ మ్యాన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఓ షాట్ ఫర్ ఫెక్ట్ గా రావాలంటే కచ్చితంగా నటీనటులకు మేకప్ అందాన్ని తెచ్చిపెడుతుంది. 50 శాతం లొకేషన్ మరో 50 శాతం మేకప్ కు ప్రాధాన్యత ఉంటుంది. అంతలా తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్ మేకప్‌కు ఉంది.

దీనికి మంచి ఉదాహరణ బెల్ బాటమ్ సినిమాలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా వేసింది. ఈ సందర్భంగా విడుదలైన లారా దత్తా లుక్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందిరా గాంధీ గెటప్‌లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె ఒదిగిపోయారు. నిజంగానే ఇందిరా గాంధీ నటించిందా అన్నంత రియాల్టీగా మారిపోయారు. అంతలా మేకప్ వేశారు లారాకు.
చాలామంది దత్తా లుక్ ను గుర్తుపట్టలేదు. దీంతో నెటిజన్లు ఒకరిపై ఒకరు పందెం కడుతూ.. ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. దీంతో నెటిజన్లు రకరకాల పోస్టులు కూడా పెడుతున్నారు. మరో ఇందిరాగాంధీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఫొటో చూశారుగా.. మీరు కూడా గుర్తు పట్టలేదు కాదా.. అలా ఒదిగిపోయారు లారా దత్తా.
ఈ మూవీని దర్శకుడు రంజిత్ ఎం.తివారీ తెరకెక్కిస్తున్నారు. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ మూవీకి హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరెన్నో సన్నివేషాలను ఇందిరా హయాంలో జరిగినవి చూపించారంట. ఈ చిత్రం ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

































