బెంగాల్లో 200 మంది బీజేపీ నేతలు అరెస్ట్!

0
278

కోల్‌కతాలో చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్‌తో సహా 200 మంది బిజెపి మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కోల్‌కతాలోని సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు బీజేపీ నేతలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారింది. దీంతో అరెస్టు చేసిన వారందరినీ కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ లాకప్‌కు తీసుకువెళ్లారు.

కాగా హౌరా జిల్లాలోని బాగ్నాన్‌లో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ కి వ్యతిరేకంగా బిజెపితో పాటు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పోలీసు సిబ్బందికి మరియు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా సమావేశమైనందున ఆందోళనకారులను అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.