Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా మారిన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి ఈయన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ 23 స్థానాలలో పోటీ చేయగా అన్నిచోట్ల భారీ మెజారిటీతో గెలిచి సంచలనమైన విజయం అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విజయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అలనాటి రామచంద్రుడు అనే చిన్న సినిమాలో నటించిన మోక్ష అనే బెంగాలీ నటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ గొప్ప వ్యక్తి..
బెంగాలీలో కూడా తెలుగు సినిమాలు విడుదల అవుతాయని ఈమె తెలిపారు. తెలుగు సినిమాలకు ఇండియా వైడ్ ఎంతో మంచి ఆదరణ ఉందని ఈమె వెల్లడించారు. తనకు సాయి పల్లవి రష్మిక నటన అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని ఆమె కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశం మొత్తం తెలుసని మోక్ష వెల్లడించారు. ఈయన తన సక్సెస్ తో దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు అంటూ చెప్పడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



























