ఒకప్పుడు డబ్బుల కోసం దొంగలు మనచుట్టూ తిరిగే వాళ్ళు.. ఇప్పుడు డిజిటలైజేషన్ పుణ్యమాఅని దొంగలు ఎక్కడో ఉండి మన మనకు తెలియకుండానే మన అకౌంట్స్ లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేరగాళ్ళు చేస్తున్న మోసాలకు బలవుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. నగదు కార్యకలాపాలు డిజిటలైజేషన్ అయిన తరువాత వీరి మోసాలకు అడ్డు అడుపూలేకుండా పోతుంది. తాజగా కరోనా వ్యాక్సిన్ పేరుతొ సైబర్ నేరగాళ్ళు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు.

ఫోన్ చేసి మేము డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నామని.. కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. ఆ రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్ తో పాటూ ఓటిపీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారి మాటలు నమ్మి OTP నంబర్ చెబుతున్న వారి ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఖాతానుండి కేవలం రెండు గంటల్లో రూ.12 లక్షలు కాజేసారు. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇటువంటి ఫేక్ కాల్స్ మరియు మెసేజ్ ల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. మీ విలువైన సమాచారాన్ని ఎవరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా OTP కోసం ఎవరైనా ఫోన్స్ చేస్తే.. వారిమాటలు గుడ్డిగా నమ్మేయకుండా జాగ్రత్త వహించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here