మన సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం లేవగానే దేవుని తలుచుకుంటూ రోజంతా సవ్యంగా జరగాలని ప్రార్థిస్తాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన దేవుని తలుచుకొని రోజును ప్రారంభిస్తారు. అయితే ఉదయం లేవగానే మొట్టమొదటిగా సూర్య నమస్కారం చేయాలి అని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మన పెద్దవారు ఇప్పటికీ సూర్యనమస్కారాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.

సూర్య నమస్కారం చేయడం వల్ల మన మనస్సు ఎంతో విశాల వంతంగా ఉంటుంది. మన జీవితంలో విజయాలు సాధించాలంటే సూర్య నమస్కారం తప్పనిసరి అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఉదయించే సూర్యుడు ఎంతో పెద్దగా ఎర్రగా ఆహ్లాదంగా కనిపిస్తాడు. ఆ రంగులో ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేయడం వల్ల మనలో చైతన్యం, చురుకుదనం వస్తాయి.

మన ఇంట్లో ఏడు గుర్రాల పై సూర్యభగవానుడు ఉన్నటువంటి ఫోటోను తప్పకుండా ఉంచుకోవాలి. ఈ ఫోటోను తూర్పు గోడకు వేలాడుతూ ఉండాలి. మనం ఉదయం లేవగానే దేవుడి గదిలో ఉన్న ఈ సూర్యభగవానుడిని ఫోటోను చూసి నమస్కరించు కోవటం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి సూర్యుని ఫోటో తొలగించ కూడదు. సూర్యుడి ఫోటో వల్ల ప్రతిరోజు మన ఇంట్లోకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.

ప్రతి రోజు సూర్యుని ఫోటో ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచి ఎర్రటి పువ్వులను అందులో వేయడం ద్వారా రోజంతా మన మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ విధంగా సూర్యుడు ఫోటోని నమస్కరించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పురోహితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here