టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాదా. ఈమె అచ్చ తెలుగు అమ్మాయిలా “కృష్ణగాడి వీరప్రేమ గాథ” చిత్రంలో నటించి తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్,నోటా ,కవచం, ఎఫ్–2 బట్టి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మెహరీన్ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌నీ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది.రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 12న వీరిద్దరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే మెహ్రీన్ భవ్య బిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.అలాగే భవ్యతో గానీ, ఆయన కటుంబ సభ్యులతో గానీ తనకు ఎలాటి సబంధం ఉండబోదని స్పష్టం చేసింది.
తాజాగా భవ్య బిష్ణోయ్ మెహ్రీన్‌తో పెళ్లి రద్దు విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇద్దరి పరస్పర అంగీకారంతోనే కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లిని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.కానీ కొందరు తమ ఫ్యామిలీని టార్గెట్ చేసి అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించాడు. ఇక ఈ విషయంపై అనవసరపు రాద్ధాంతం చేస్తే వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా భవ్య బిష్ణోయ్ హెచ్చరించాడు.































