Bheeshma Sujatha: శోభన్ బాబు వద్దన్నా పెళ్ళిచేసుకున్నా… జమీందారు సంబంధం అని పెళ్లి చేసుకున్న చివరికి ఇలా?

0
299

Bheeshma Sujatha: వెండి తెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సీనియర్ నటిమని సుజాత గురించి నేటి తరం వారికి తెలియకపోయినప్పటికీ ఒకప్పుడు ఈమె అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఈమె భీష్మ సినిమాలో మత్స్య కన్యగా నటించడంతో ఈమె భీష్మ సుజాతగా పేరు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి భీష్మ సుజాత చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు అతి చిన్న వయసులోనే పిఠాపురం జమీందారు సంబంధం రావడంతో పెళ్లి చేశారని తెలిపారు.

ఇలా తనకు పెళ్లి నిశ్చయమైనప్పుడు శోభన్ బాబు గారు ఇంత చిన్న వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అమ్మ అని తనకు చెప్పినప్పటికీ తాను మాత్రం వినకుండా పిఠాపురం సంబంధం అని పెళ్లి చేసుకున్నాను అయితే అప్పటికే ఆయనకు పెళ్లి జరిగింది మొదటి భార్య అంగీకారంతోనే తనని రెండవ పెళ్లి చేసుకున్నారని తెలిపారు.

Bheeshma Sujatha: దానధర్మాలు చేయటం వల్ల ఆస్తులు కరిగిపోయాయి…


అయితే ఆయనని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. కానీ తన భర్త చేసే దానధర్మాల వల్ల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా కరిగిపోయాయని మరికొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలో ఉన్నాయని సుజాత వెల్లడించారు.ఇలా ఆర్థిక పరిస్థితులు తనని వెంటాడటంతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చానని అయితే హీరోయిన్ గా మాత్రమే కాకుండా డబ్బింగులు కోరసులు డ్రామాలు అన్నీ కూడా చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుజాత తన వ్యక్తిగత జీవితం గురించి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.