Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చిరంజీవి తమన్న హీరో హీరోయిన్లుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం భోళా శంకర్.

ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ మెహర్ రమేష్ కీలక అప్డేట్ విడుదల చేశారు.ఇలా గత కొంతకాలంగా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకున్నటువంటి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈయన ఈ సినిమా కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడ్డామని,ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నటీనటులు ఎంతో సహకరించారని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, ఇక ప్రమోషన్ కార్యక్రమాలు సాంగ్స్ రిలీజ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.

Bhola Shankar:శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
ఈ సినిమా షూటింగ్ పనులన్నింటిని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
































