Bhumika: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో హీరోయిన్గా అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి భూమిక యోగ టీచర్ భరత్ ఠాకూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహం తర్వాత కూడా తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న భూమిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే గతంలో భూమికకు తన భర్త భరత్ కి మధ్య మనస్కర్తలు వచ్చాయని ఆ క్షణం వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇలా విడాకులకు సిద్ధమైన భూమిక భరత్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున జోక్యం చేసుకొని వీరిద్దరికీ బాగా అర్థమయ్యేలా వివరించి చెప్పడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనే ఆలోచన విరమించుకున్నారని తెలుస్తోంది. ఇలా వీరి విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ కావడంతోనే వీరి కాపురం చక్కబడిందని తెలుస్తుంది.

Bhumika: మనస్పర్ధలే కారణమా….
అసలు భూమిక ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు అనే విషయానికి వస్తే..పెళ్లయిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి భూమిక తన భర్తకు ఇష్టం లేకపోయినా బలవంతంగా హైదరాబాద్ తీసుకువచ్చి సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారట తన భర్త వద్దని చెబుతున్నప్పటికీ నిర్మించడంతో సినిమా ద్వారా భారీగా నష్టాలు వచ్చాయని దాంతో ఇద్దరికీ మనస్పర్ధలు రావడం భరత్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే విడాకుల వరకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరీ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ కావడంతో విడాకుల ఆలోచనను మానుకున్నారని తెలుస్తుంది.































