Bhumika: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి భూమిక. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. అప్పట్లో హీరోయిన్గా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు సినిమాలలో నటిస్తూ సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న భూమిక తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో నాని వదిన పాత్రలో నటించారు అనంతరం సీతారామం బటర్ ఫ్లై వంటి సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె టాలీవుడ్ హీరోల ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెబుతారు అనే ప్రశ్న ఎదురయింది.
ఫెంటాస్టిక్ డాన్సర్..
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. చిరంజీవి గ్రేట్ డాన్సర్ ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్, మహేష్ బాబు క్యూట్, పవన్ కళ్యాణ్ ఇంటెలిజెంట్ వెంకటేష్ స్పిరిచువల్ అంటూ స్టార్ హీరోల గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ నేను ఎంతో మంది హీరోల దగ్గర సినిమాలు చేశాను కానీ మహేష్ మాత్రం చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన వేసే జోక్ లకు నవ్వు ఆపుకోలేనని తెలిపారు.



























