Maheswari: మహేశ్వరి హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా వెండితెరపై తనదైన ముద్ర వేసింది. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కరుతమ్మ’ సినిమాతో పదహారేళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చింది. తెలుగులో ‘అమ్మాయి కాపురం’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేశ్వరీ చేసిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా ‘గులాబీ’ ఆ సినిమాలో మహేశ్వరి అద్భుతమైన నటన కనబరిచింది.

రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ‘దెయ్యం’, ‘పెళ్లి’, ‘మా బాలాజీ’, ‘గులాబి’, ‘జాబిలమ్మ పెళ్లి’, ‘నీకోసం’, ‘మా అన్నయ్య’ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మహేశ్వరి. అయితే ఇటీవల కాలంలో పెద్దగా కనిపించడం లేదు మహేశ్వరి. గతంలో కొన్ని సీరియళ్లలో మెరిసినా.. లాంగ్ స్టాండిగ్ కాలేదు. తాజాగా ఆమె ఓ టీవీ షోలో కనిపించింది.

ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అందాల తార శ్రీదేవితో మహేశ్వరికి చుట్టరికం ఉందని చాలా మందికి తెలుసు. శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుందని అంతా అనుకుంటారు. అయితే శ్రీదేవి తనకు చిన్నమ్మ అవుతుందని.. కానీ తాను మాత్రం అక్క అని పిలిచేదాన్ని అని తెలిపింది.
అలా బ్రతికి బయట పడ్డాము…
శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిందని అంతా పొగరని అనుకునే వాళ్లని.. కానీ తనకు పొగరులాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చింది. గులాబీ సినిమాలో ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ సాంగ్ షూటింగ్‌లో తమ బైక్ స్కిడ్ అయి లోయలో పడిపోయిందన్న తెలిపింది. అయితే లోయ తక్కువ లోతులో ఉండటం వల్ల బతికిపోయామంటూ ప్రమాదాన్ని గురించి మరోసారి వివరించింది.































