Big Boss season 6 : బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి హిట్. ఇంగ్లీష్ నుండి దిగుమతి చేసుకున్న ఈ షో ఇండియా లోనూ మంచి ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో కూడా ఐదు సీజన్లలను విజయవంతంగా పూర్తి చేసుకుంది, ఇక ఇప్పుడు ఆరో సీజన్ కూడా మొదలయింది. అయితే జనాలు షో చూస్తున్నా ఒక విషయంలో మాత్రం గుర్రుగా ఉన్నారు. బిగ్ బాస్ ప్రమోషన్స్ తో బాగా అంచనాలు పెంచినా చివరికి మాత్రం ఒక విషయంలో మోసం చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

కామన్ వాళ్ళు ఎక్కడా…
బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యే ముందే ప్రమోలతో బాగా హైప్ పెంచేశారు మా టీవీ వాళ్ళు. షో ఎలా ఉండబోతోంది, ఇక కంటెస్టెంట్స్ లీక్ తో మరింత ఇంట్రెస్ట్ షో మీద క్రియేట్ చేసారు. ముఖ్యంగా ఈసారి షోలో ఇద్దరు సాధారణ వ్యక్తులను షో కి తీసుకొస్తారు అంటూ బాగా ప్రచారం జరిగింది. ఇక సీజన్ 6 మొదలవ్వక ముందే ప్రోమోల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకు ముందు ఒక సీజన్ లో కూడా ఇద్దరు కామన్ పీపుల్ ని ప్రవేశపెట్టారు బిగ్ బాస్ యాజమాన్యం. కానీ షో మొదలయ్యాక 21 మంది కాంటెస్టంట్స్ లో కామన్ పీపుల్ జాడ లేదు. ఇక ఈవిషయం గురించే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట్లో బాగా ట్రోల్ చేస్తున్నారు. కామన్ పీపుల్ ని తీసుకొస్తామని చెప్పి మోసం చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎప్పటిలాగా కమ్యూనిస్ట్ నేత సిపిఐ నారాయణ బిగ్ బాస్ గురించి తీవ్ర వాఖ్యలు చేసారు. అందులో పాల్గొనేవారిని వింత జంతువులుగా పోల్చారు. ఇక నాగార్జున ని కూడా విమర్శించారు నారాయణ. ఇక కామన్ పీపుల్ విషయంలో నిరాశ పరిచిన బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ లో ఏమైనా వారిని పంపిస్తాడేమో చూడాలి.































