Janasena: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగింది. ఈ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయినప్పటికీ దీనిని ఫ్రీ సింబల్స్ లో పెట్టడంతో అయోమయం నెలకొంది. జనసేన అభ్యర్థుల పోటీ చేసే చోట గాజు గ్లాస్ గుర్తును కేటాయించినప్పటికీ ఈ అభ్యర్థులు పోటీ లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.

ఇలా కేటాయించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని జనసేన నాయకులు ఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు. రిటర్నింగ్ అధికారుల నిర్ణయంపై జనసేన కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో, అలాగే జనసేన పోటీలో ఉన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నామని తెలిపారు.
ఇక ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేస్తున్నారో వారికి గ్లాస్ గుర్తు ఇవ్వడంలేదని తెలిపారు. ఈసీ ఈ నివేదికలతో కోర్టులో ఈ పిటిషన్ కూడా కొట్టివేశారు. ఇకపోతే ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 13 చోట్ల ఈ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీజ్ చేశారు.నేపథ్యంలో ఈ 13 లోక్ సభ స్థానాల పరిధిలో జనసేనకు అలాగే కూటమి పార్టీలకు రిలీఫ్ లభించనుంది.
13 ఎంపీ స్థానాలు..
ఇక ఈ ఎన్నికలలో భాగంగా జనసేన రెండు లోక్ సభ స్థానాలలో అలాగే 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.21 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, అమలాపురం, నరసాపురం ఈ13 ఎంపీ స్థానాలలో ఈసీ గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా ఫ్రీజ్ చేసింది.





























