Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్యను త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి మరొక నటి శోభిత ప్రేమలో పడ్డారు. ఈ తరుణంలోనే వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా నాగచైతన్య శోభితకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య కోసం శోభిత పెద్ద త్యాగం చేశారని తెలుస్తుంది. కాబోయే భర్త కోసం ఈమె చేసిన ఆ త్యాగం ఏంటి అనే విషయానికి వస్తే..
సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమ ఉండేది అయితే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం సినిమాలే అని తెలుస్తుంది. సమంత ఎప్పుడైతే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అదే విడాకులకు కారణమైంది అంటూ ఒకానొక సమయంలో వార్తలు కూడా హల్చల్ చేశాయి.
బోల్డ్ సినిమాలు..
ఇలా సమంత నాగచైతన్య జీవితంలో జరిగిన తప్పు తిరిగి శోభిత నాగచైతన్య విషయంలో జరగకుండా ఉండటం కోసం వీరిద్దరూ ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది. అందుకే నాగచైతన్య పెళ్లికి ముందే శోభితకు ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లు కానీ సినిమాలలో కానీ నటించకూడదని కండిషన్ పెట్టారట. ఇక ఈ కండిషన్ కి శోభిత కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. నాగచైతన్య పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉన్న శోభిత తనతో కలిసి సంతోషంగా జీవించడం కోసం ఈ త్యాగం చేశారని సమాచారం.





























